బత్తాయి రైతులకు అండగా నిలుద్దాం- మంత్రులు

176
ministers
- Advertisement -

ఈ రోజు బత్తాయి మార్కెటింగ్‌పై ఎల్బీనగర్ రైతుబజార్‌లో జరిగిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లు హాజరైయ్యారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి , చిరుమర్తి లింగయ్య , నల్గొండ కలెక్టర్ ప్రశాంత్ పాటిల్, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి, మార్కెట్ చైర్మన్ రాంనర్సింహగౌడ్,బత్తాయి రైతులు, ట్రేడర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. బత్తాయి వినియోగం స్థానికంగా పెరగాలి. ఈ దిశగా ప్రజలను చైతన్యం చేయాలి.పత్రికల ఎడిటర్లు, సినీ, టీవీ నటులు ఈ మేరకు బత్తాయి, నిమ్మ ఫలాలు తిని ప్రజలు మన రైతులకు బాసటగా నిలవాలని పిలుపునివ్వండి అని అన్నారు. ఈ ఫలాలు తింటే వచ్చే సి విటమిన్ మూలంగా ఉండే లాభాలను ప్రజలకు వివరించాలి. కష్టకాలంలో బత్తాయి రైతుకు అండగా నిలవాలి. బయటి పండ్లను, కోల్డ్ స్టోరేజిలో దాచి తెచ్చిన పండ్లను మనం వినియోగిస్తున్నాం. మన దగ్గర పండిన నాణ్యమైన తాజా పండ్లను వినియోగించకుండా వదిలేస్తున్నాం. కరపత్రాలు, వాల్ పోస్టర్లు, ప్రముఖుల సందేశాలతో కిందిస్థాయికి ప్రచారం చేరాలి. బత్తాయి పంటను ఆర్మీకి పంపే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం.కర్నూలు సిరివెల్ల బత్తాయి ట్రేడర్లతో మాట్లాడండి అని మంత్రి అధికారులను ఆదేశించారు.

niranjan reddy

ట్రేడర్లు ప్రస్తుత పరిస్థితులలో బత్తాయి కొనుగోలు సమస్యను వ్యాపారంగా భావించొద్దు .. రైతులకు చేస్తున్న సేవగా భావించండి. ఢిల్లీలో తమకు వసతి కల్పిస్తే మార్కెట్ అవకాశాలు పరిశీలించుకుంటామన్న రైతులు. ఢిల్లీ తెలంగాణ భవన్ లో ఉచితంగా రైతులకు వసతి కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాం. బత్తాయిపంట రైతులు తొందరపడి వెంటనే కోయొద్దు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు వెంటనే రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్యం చేయాలి. మహారాష్ట్ర జెలగాం, నాందేడ్ జ్యాస్ ఫ్యాక్టరీలతో మాట్లాడి బత్తాయి రోజుకు ఎంత మొత్తం ఎగుమతి చేయగలమో మాట్లాడాలని ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డికి ఆదేశించారు మంత్రి.

ధర తగ్గించుకోవడానికి రైతులు సిద్దంగా ఉన్నారు.వారికి ఈ సమయంలో సమాజం అండగా నిలవాలి. బత్తాయి, నిమ్మ రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున అన్ని మార్గాలను అన్వేషణ చేస్తున్నాం. వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మే 3 వరకు లాక్ డౌన్ నేపథ్యంలో రైతులు బత్తాయి కోత విషయంలో తొందపడొద్దు అని మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు.

మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. బత్తాయి వినియోగంపై విస్తృత ప్రచారం జరగాలి. తరచూ సమావేశాల ద్వారా ఎక్కువ చర్చ జరిగి మంచి సూచనలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలలో బత్తాయి వినియోగంపై అవగాహన పెరిగి వాడకం మొదలైతే బత్తాయి రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కరోనా క్వారంటైన్ సెంటర్లలో ఉన్నవారికి బత్తాయి పండ్ల సరఫరా చేయాలి. బత్తాయి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. కాలనీలు , గేటెడ్ కమ్యూనిటిలతో మాట్లాడుతాం.బత్తాయి వినియోగం పెంచేలా చూస్తాం. ప్రజలకు పండ్ల వినియోగం మూలంగా వచ్చే ప్రయోజనాలు వివరించేలా చూస్తామన్నారు.

- Advertisement -