వ్యవసాయ రంగం బలోపేతంపై దృష్టి:నిరంజన్ రెడ్డి

36
- Advertisement -

సీఎం కేసీఆర్ వ్యవసాయరంగం బలోపేతంపై దృష్టిసారించాన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి జిల్లా సంకిరెడ్డి పల్లి వద్ద ఆయిల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమిపూజతో పాటు శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడారు మంత్రి నిరంజన్ రెడ్డి. వ్యవసాయం బలోపేతం చేసే క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పంటల మార్పిడికి శ్రీకారం చుట్టారన్నారు. అందులో భాగంగానే ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నాం అన్నారు.

దేశంలో ఏటా 22 మిలియన్ టన్నుల నూనెలు అవసరం అని…ఇందులో ఎక్కువ మొత్తం విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం అన్నారు. ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహానికి జిల్లాల వారీగా జోన్లను విభజించి కంపెనీలకు అప్పజెప్పాం అని…35 ఏళ్లలో 39 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతుందన్నారు. గత రెండేళ్లలోపే లక్ష 22 వేల ఎకరాల్లో కొత్తగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాం అని…త్వరలోనే రెండు లక్షల ఎకరాలకు చేరుకుంటాం అన్నారు.

కోతులు, చీడపీడల బెడదలేని పంట ఆయిల్ పామ్ అని….ఆయిల్ పామ్ సాగు రైతుకు భరోసానిచ్చే క్రమంలో 40 ఎకరాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తొలి ఫ్యాక్టరీ సంకిరెడ్డిపల్లిలో ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. ఫ్యాక్టరీకి అవసరమైన మేరకు ఆయిల్ పామ్ సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తాం అని…వ్యవసాయం బలోపేతం చేసే క్రమంలో కరంటు, సాగునీళ్లు, రైతుబంధు, రైతుభీమాతో పాటు వందశాతం కొనుగోళ్లు చేపట్టాం అన్నారు.

Also Read:KTR:రైతుబంధు ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్..

- Advertisement -