వ్యవసాయ శాఖ సేవల పరిశీలనకు కాల్ సెంటర్…

51
niranjan
- Advertisement -

వ్య‌వ‌సాయ శాఖ సేవ‌ల ప‌రిశీల‌న‌కు కాల్ సెంట‌ర్ ఏర్పాటుచేస్తామ‌ని తెలిపారు మంత్రి నిరంజ‌న్ రెడ్డి. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని రైతుబంధు సమితి అధ్యక్షుడి కార్యాలయంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ ప్రారంభించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఈ కార్య‌క్ర‌మంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి , వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, శాసనమండలి సభ్యులు ఎల్.రమణ తదితరులు హాజ‌ర‌య్యారు.

రైతుబంధు, రైతుభీమా అమలు, పంటల వైవిధ్యీకరణ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. వ్యవసాయ శాఖ వద్ద అందుబాటులో రాష్ట్రంలోని 63 లక్షలమంది రైతుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు త్వరలో అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్ వ‌స్తుందన్నారు. రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ప్రయత్నం అన్నారు.

అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతులకు మరింత చేరువ అవుతాం అని తెలిపిన నిరంజ‌న్ రెడ్డి…భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్ల క్లస్టర్ పరిధిలో మరణించిన రైతు వెంకటేశ్వర్లు కుమారుడు రవీంద్రబాబుతో రైతుభీమా అందిన వివరాలను కాల్ సెంటర్ నుండి మాట్లాడి తెలుసుకున్నారు.

- Advertisement -