తెలంగాణ ఏర్పడ్డ తర్వాత వ్యవసాయం అనుబంధ రంగాలపై దృష్టి సారించామని.. సాగు బలపడితే ఆదాయం పెరుగుతుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఇవాళ జరిగిన ఆగ్రో ఫారెస్ట్రీ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సంక్షేమం కోసం రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేస్తున్నాం.. ఐదేండ్లలో రైతుల జీవితాల్లో వెలుగులు నింపాము. రాష్ట్రంలో సాగుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సాగుకు కావాల్సిన నీటి కోసం ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం.. గతంలో మన ప్రాజెక్టులు విస్మరణకు గురయ్యాయి.. తరాలు గడిచినా ఎస్ఎల్బీసీ, ఏఎమ్మార్పీ లాంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు. సీఎం కేసీఆర్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు మూడేండ్లలో పూర్తి కావచ్చింది.
అలాగే రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందన్నారు. బంగారు తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ దారులకు పెద్ద జితగానిగా నన్ను వ్యవసాయ మంత్రిని చేశారు. ఆయన నాపై పెట్టి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తాను అన్నారు. వ్యవసాయంతో బతకగలమనే ఆత్మవిశ్వసాన్ని యువతలో కలిగించే ప్రణాళికలు అమలు చేస్తున్నాం.. రైతు ఆదాయాన్ని పిరియాడికల్ గా పెంచే ప్రతిపాదన చేశాం. ఉపాధి హామీ పథకం వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రన్నీ కోరాము. రైతుబందు సాయాన్ని 10 వేలకు పెంచే హామీని అమల్లోకి తెచ్చాము.
ఇక రాష్ట్రంలో శ్రీగంధం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా తీసుకున్నాం.. ఏడాదిగా గ్రౌండ్ వర్క్ చేసి.. కేరళ నుండి విత్తనాలు తెచ్చాము. శ్రీగంధం చెట్ల పెంపకం, అమ్మకం కోసం ఓ విధానం తీసుకోస్తాం. శ్రీగంధం మొక్కల పెంపకానికి తెలంగాణ ఎంతో అనుకూలమన్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్టాల తర్వాత ప్రపంచంలో తెలంగాణ మాత్రమే ఈ మొక్కల పెంపకానికి అనుకూలం. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా మొక్కల పెంపకం సాగాలి.. విదేశాల్లో డిమాండ్ ఉన్న సుగంధ మొక్కలు, గడ్డి పెంపకంపై దృష్టి సారించాలి. అందుకుగాను ప్రభుత్వం ఇన్పుట్స్ 95 శాతం సబ్సిడీ ఇస్తుంది. శ్రీగంధం మొక్కల పెంపకం వివరాలను ఉద్యానవన శాఖ రిజిస్టర్ చేస్తుందని మంత్రి అన్నారు.