వ‌రంగ‌ల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్ర‌భంజ‌నం..

248
Minister Errabelli Dayakar Rao Speech at Warangal
- Advertisement -

వ‌రంగ‌ల్ ప్ర‌జానికం టిఆర్ఎస్ పార్టీని,సీఎం కేసిఆర్ పాల‌న‌ను విశ్వ‌సిస్తున్నార‌ని పంచాయ‌తీరాజ్ శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. పూర్వ వ‌రంగ‌ల్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీగా టిఆర్ఎస్ పార్టీ అభ్య‌ర్థి పోచంప‌ల్లి శ్రీ‌నివాస్‌రెడ్డి ఘ‌న విజ‌యం సాధించడంతో మ‌రోసారి తేట‌తెల్లం అయ్యింద‌న్నారు. హ‌న్మ‌కొండ‌లోని మంత్రి నివాసంలో ఎమ్మెల్సీగా ఘ‌న‌విజ‌యం సాధించిన పోచంప‌ల్లిని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు పుఫ్ప‌గుచ్చం అంద‌జేసి అభినంధించారు. మంత్రి తోపాటు ఎంపీ బండా ప్ర‌కాష్‌, ఎమ్మెల్యేలు విన‌య్‌భాస్క‌ర్‌, డాక్ట‌ర్ టి.రాజ‌య్య‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, అరూరి ర‌మేష్‌, న‌న్న‌పునేని న‌రెంద‌ర్‌, బాల్క సుమ‌న్‌, చైర్మ‌న్‌లు రాజ‌య్య‌, వాసుదేవారెడ్డి, మ‌ర్రి యాద‌వ‌రెడ్డి, మేయ‌ర్ గుండా ప్ర‌కాశ్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్తలు, అభిమానులు అభినందన‌లు తెలియ‌జేశారు.

Minister Errabelli Dayakar Rao

ఈ సంధ‌ర్భంగా మీడియాతో మంత్రి ఎర్ర‌బెల్లి మాట్లాడతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ది ప‌థంలో నిలిపేందుకు ముఖ్య‌మంత్రి కేసిఆర్ నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని అన్నారు. ప్ర‌జ‌లు సీఎం కేసిఆర్ పాల‌న ప‌ట్ల విశ్వాసంతో ఉన్నార‌ని,ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో జిల్లాలో రెండు ఎంపీ స్థానాల్లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్ద‌రిని అత్య‌ధిక మెజార్టీతో గెలిపించార‌న్నారు. ఎన్నిక‌లు ఏవైనా విజ‌యం టిఆర్ఎస్ పార్టీదేనన్నారు.భారీ మెజార్టీతో వ‌రంగ‌ల్ ఎమ్మెల్సీగా శ్రీ‌నివాస్‌రెడ్డిని గెలిపించి సీఎం కేసిఆర్‌కు, పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్‌కు బ‌హుమానంగా ఇస్తున్నామ‌న్నారు.

భారీ మెజార్టీకి కృషి చేసిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిల‌ర్లు, కార్పోరేట‌ర్లు, ఎమ్మెల్యేలు,  ఎంపీల‌తోపాటు, గెలుపు కోసం కృషిచేసిన‌ ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు మంత్రి ఎర్ర‌బెల్లి.ఇదే ఉత్స‌హాంతో రేపు అన్ని జెడ్పీ చైర్మ‌న్లు, ఎంపీపీ స్థానాల‌ను కైవ‌సం చేసుకోబోతున్నామ‌న్నారు.ప్ర‌తి టిఆర్ఎస్ అభిమాని అందుకు కృషిచేయాల‌ని కోరారు.

- Advertisement -