కేసీఆర్‌ ముందుచూపుతో తెలంగాణ దశ తిరిగింది..

216
Minister Niranjan Reddy
- Advertisement -

నాగర్ కర్నూలులో నియంత్రిత సాగుపై ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌ రెడ్డి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, మండలి విప్‌ దామోదర్‌ రెడ్డి, జెడ్పి చైర్‌ పర్సన్‌ పద్మావతి, ఎంపీ రాములు, కలెక్టర్‌ శ్రీధర్‌,పెద్ద ఎత్తున్న రైతులు పాల్గొన్నారు.

Minister S Niranjan Reddy

మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ముందుచూపుతో తెలంగాణ దశ తిరిగింది. ఇక్కడ ఉన్న వాతావరణ, భౌగోళిక పరిస్థితులు దేశంలో మరెక్కడా లేవన్నారు. రాబోయే రోజులలో తెలంగాణలో బావిలో చెంబుతో నీళ్లు ముంచుకునే పరిస్థితులు వస్తాయన్నారు. ఆరేళ్ల కేసీఆర్‌ పాలనతో అభివృద్ది వైపు రాష్ట్రం పరుగెత్తుతుందన్నారు.

Niranjan Reddy

వ్యవసాయం బాగుపడితే గ్రామాలు బాగుపడతాయని వినూత్న పథకాలు తెచ్చారన్నారు. దేశానికి అన్నం పెట్టే స్థితికి తెలంగాణ వస్తుంది. కోటి 23 లక్షల ఎకరాలలో ఈ ఏడాది సాగు జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈ సారి 40 లక్షల ఎకరాలలో వరి సాగయిందని, రైతుల బాగుకోసమే సమగ్ర వ్యవసాయ విధానం తెచ్చారన్నారు.

- Advertisement -