సామ్‌ 10th మార్కులు చూస్తే షాక్‌ అవుతారు..

40
actress samantha

టాలీవుడ్ హీరోయిన్లలో సమంత రూటే వేరు. ఆమె నటన, మాట, చేసే పనులు అన్నీ భిన్నంగా ఉంటాయి. కేవలం తన నటనతోనే కాకుండా వ్యక్తిత్వంతోనూ భారీగా అభిమానుల్ని సంపాదించుకోవడం సమంత ప్రత్యేకత. ఆమె అప్పుడప్పుడూ నెటిజన్లతో చేసే చిట్‌చాట్లు,సోషల్‌ మీడియాలో పెట్టే పోస్ట్‌లు కూడా ఆసక్తి రేకెత్తిస్తుంటాయి. సామ్‌ తాజాగా తన ఫేస్‌ బుక్‌లో ఫోటోస్‌ను షేర్‌ చేసింది. స్కూల్‌, కాలేజీలో ఇచ్చిన ప్రోగ్రెస్‌ రిపోర్టులు పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్‌ వైరల్‌గా మారాయి.

సమంత 10, 11వ తరగతుల్లో మంచి మార్కులు సంపాదించింది. సీఎస్‌ఐ సెయింట్‌ స్టీఫెన్‌ మెట్రిక్యులేషన్‌ స్కూల్‌లో సమంతకు పదోతరగతిలో గణితం-పార్ట్‌-1లో 100కు 100 మార్కులు రాగా..గణితం పార్టు-2లో 99 మార్కులు రావడం విశేషం. ఇంగ్లీష్‌లో 90 మార్కులు వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులు వచ్చాయి.

అలాగే హోలీ ఎంజెల్స్‌ ఆంగ్లో ఇండియన్‌ హయ్యర్‌ సెకండరీ స్కూల్‌లో 11వ తరగతిలో కూడా సబ్జెక్టులా వారిగా మంచి ప్రతిభను కనబర్చింది.చిన్నతనంలో నేర్చుకున్న ప్రతిభ పాఠవాలు భవిష్యత్ లో ఉన్నత స్థానాలకు చేరుస్తాయనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ఇందుకు నటి సమంత చక్కటి ఉదాహరణ.