వానాకాలం సాగుకు ఎరువుల కొరత ఉండొద్దు..

216
Minister niranjan reddy review on fertilizers
- Advertisement -

ఈ రోజు హైదరాబాద్‌లోని హాకాభవన్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వానకాలం ఎరువులపై సమీక్ష నిర్వహంచారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి,మార్క్ ఫెడ్, రైల్వే , అగ్రోస్ అధికారులు, ఎరువుల కంపెనీల ప్రతినిధులు, హ్యాడ్లింగ్ ఏజెంట్లు హాజరైయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ.. వానాకాలం సాగుకు ఎరువుల కొరత ఉండొద్దు. రాష్ట్రం కోసం గతంలో కోరిన రేక్ పాయింట్లు వెంటనే మంజూరు చేయాలని రైల్వే అధికారులను కోరండని తెలిపారు. రామగుండం ఎరువుల కార్మాగారం వెంటనే పూర్తి చేయడానికి ప్రభుత్వ సంపూర్ణ సహకారం ఉంటుంది. క్షేత్రస్థాయికి ఎరువుల నిల్వలు చేరాలి అన్నారు.

Minister niranjan reddy review on fertilizers

కరోనా వైరస్‌ను దృష్టిలో ఉంచుకుని దానికి తగినట్లు ఎరువుల సరఫరాకు ఏర్పాట్లు చేయాలన్నారు. రేక్ పాయింట్లలో ఎరువులు 24 గంటలలో అన్ లోడ్ అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలి. ఏప్రిల్ వాటా 35 వేల మెట్రిక్ టన్నులు, మే వాటా 1.6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా వెంటనే తీసుకురావాలి. రాష్ట్రంలో 2.68 లక్షల యూరియాతో కలిపి 6.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సిద్దంగా ఉన్నాయన్నారు మంత్రి. మే వరకు 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, లక్ష ఇతర ఎరువులు బఫర్ నిల్వల కింద అందుబాటులో ఉంచాలని అధికారులను అదేశించారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.

- Advertisement -