రైతుల ఖాతాల్లోకి రైతుబంధు డబ్బులు..

275
Minister niranjan reddy
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుబంధు నిధులు రైతుల ఖాతాల్లోకి జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రికార్డు సమయంలో ఒకే రోజు 50.84 లక్షల మంది రైతులకు రూ.5294.53 కోట్లు ఖాతాలలో జమ చేశామన్నారు. సోమవారం ఉదయం 10 గంటల నుండి గంటకు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్యులు పంపించామని.. ఆర్ ఓ ఎఫ్ ఆర్ (ఏజెన్సీ) పట్టాదారులకు చెందిన 63,477 మంది రైతులకు సంబంధించిన రూ.82.37 కోట్లు ఖాతాలలో జమ చేశామన్నారు మంత్రి నిరంజన్‌ రెడ్డి.

ఈ నెల జూన్ 16 వరకు పాస్ బుక్ లు వచ్చిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు వర్తిస్తుంది. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో రికార్డు సమయంలో విడుదల చేశాం. బ్యాంకు వివరాలు ఇవ్వని 5 లక్షల మంది రైతులు ఉన్నారు. ఏఈఓలకు వారి వివరాలు అందగానే ఖాతాలలో నిధులు జమచేయాలని మంత్రి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కరోనా విపత్తులోనూ రైతులకు రైతుబంధు నిధులు అందించాం. రెండు సీజన్ల రైతుబంధు కోసం రూ.14 వేల కోట్లు బడ్జెట్ లో కేటాయింపు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలకు ఇది తార్కాణం అని మంత్రి అన్నారు.

రైతులకు అండగా నిలుస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలు దేశానికే ఆదర్శం, రాష్ట్ర ఉజ్వల భవిష్యత్‌కు సోపానం. ప్రపంచంలోనే ఎక్కడా లేని మొదటి పథకం రైతుబంధు. కేసీఆర్ దూరదృష్టితోనే ఈ పథకం సాధ్యమయిందన్నారు మంత్రి. రైతుబంధు నిధుల జమకోసం రేయింబవళ్లు శ్రమిస్తున్న వ్యవసాయ, ఆర్థిక, రెవిన్యూ, ఎన్ఐసీ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు
తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.

- Advertisement -