రైతు బంధు పంపిణీ షురూ

33
- Advertisement -

రాష్ట్రంలోని రైతులందరికీ రైతు బంధు నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ శాఖ పై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డా.బీఆర్.అంబేద్కర్ తెలంగాణా సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్,సహకార,హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శ రామ కృష్ణ రావు, సి.ఎం.ఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు తదితర అధికారులు పాల్గొన్నారు.

దాదాపు మూడు గంటల పాటుజరిగిన ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్రంలో వ్యవసాయ శాఖా, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్బంగా సి.ఎం. శ్రీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు నేటి నుండే రైతు బంధు నిధులను సంబంధిత రైతుల ఖాతాల్లో వేసే ప్రక్రిను ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలుగకుండా పంట పెట్టుబడి సహాయం అందించాలని అన్నారు.

Also Read:జగన్ అలా.. రేవంత్ ఇలా?

- Advertisement -