పల్లె నిద్ర..గొప్ప కార్యక్రమం: నిరంజన్ రెడ్డి

97
niranjan
- Advertisement -

పల్లె నిద్ర గొప్ప కార్యక్రమమని తెలిపారు మంత్రి నిరంజన్ రెడ్డి. వనపర్తి వజ్ర సంకల్పంలో భాగంగా పల్లె నిద్ర కార్యక్రమాన్ని ఆముదంబండ, గార్లబండ తండాలో నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి …50 చోట్ల ప్రభుత్వ అధికారులతో పల్లెనిద్రలు అనేది ఒక గొప్ప సందర్భానికి నాంది అని తెలిపారు.

ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమానికి పథకాలను అమలు చేస్తుందని… వ్యవసాయానికి 24 గంటలు ఉచిత కరెంటు, గృహాలు, పారిశ్రామిక అవసరాలకు సైతం 24 గంటలు నిరంతరాయంగా కరెంటు ఇస్తున్నట్లు తెలిపారు.గ్రామాలు, పట్టణాల్లో సమస్యల పరిష్కారంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే తమ ఉద్దేశమన్నారు. తమ ఆలోచనలను ప్రజలు స్వాగతించారని, ఊరూరా వచ్చిన స్పందన ఎంతో ప్రోత్సాహం అందించిందన్నారు.

భవిష్యత్‌లో అందరి సహకారంతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పల్లె నిద్రలు నిర్వహిస్తామన్నారు. 41 గ్రామాల్లో, తొమ్మిది వార్డుల్లో, ఏడు మండలాలు, రెండు మున్సిపాలిటీల్లో 53శాఖల అధికారులతో పల్లె నిద్ర కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు మంత్రి.

- Advertisement -