మోడీ హయాంలో అదాని,అంబానీలకు డబల్ ఇన్‌కం!

123
S-Niranjan-Reddy
- Advertisement -

ప్రధానమంత్రి నరేంద్రమోడీ హయాంలో అంబానీ, అదానీలకు డబుల్ ఇన్‌ కం అని మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. 2022 వరకు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు… దేశంలో ఎరువుల ధరలు, డీజిల్, పెట్రోల్ ధరలు రెట్టింపు చేయడం ద్వారా వ్యవసాయానికి పెట్టుబడి ఖర్చులు రెట్టింపు చేశారన్నారు.రైతుల ఆదాయం రెట్టింపు చేశామన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనలపై ఆగ్రహం వ్యక్తంచేశారు.

కేంద్రం తీరు నవ్వి పోదురు గాక మాకేంటి సిగ్గు అన్నట్లు ఉందని…ఎన్నికలలో హామీ ఇచ్చిన ప్రకారం స్వామినాథన్ కమీషన్ సిఫార్సుల ప్రకారం పంటల మద్దతు ధరలు అమలు చేస్తామని చెప్పి సీ + 50 బదులు ఎ + 50 అమలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారన్నారు. దేశంలో పండే 53 పంటలకు గాను కేవలం 29 పంటలకే ఎంఎస్ పీ ప్రకటిస్తున్నారన్నారు. అందులో ప్రధానంగా నాలుగైదు పంటలనే మద్దతుధరకు కొనుగోలు చేస్తున్నారు .. అది కూడా పండిన పంటలో 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారన్నారు.

ఇక్కడ ఉన్న పంటలను కొనుగోలు చేయకపోగా అవే పంటలు దిగుమతి చేసుకుంటుండడం కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు వ్యతిరేక నిర్ణయాలకు నిదర్శనం అన్నారు. ఉపాధిహామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని ఇచ్చిన ఎన్నికల హామీని తుంగలో తొక్కారన్నారు. రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు …కేంద్రానికి వ్యవసాయ రంగం పట్ల ఒక సమగ్ర విధానం గానీ, ప్రణాళిక గానీ శూన్యం అన్నారు.

- Advertisement -