- Advertisement -
సీఎం కేసీఆర్ పిలుపుతో యాదాద్రికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా శ్రీలక్ష్మీ నరసింహాస్వామి ఆలయ విమాన గోపురం బంగారం తాపడం కోసం మంత్రి మల్లారెడ్డి 3 కిలోల బంగారం విలువ చేసే నగదును ఆలయ అధికారులకు గురువారం ఉదయం అందజేశారు.
తన కుటుంబం తరపున కిలో బంగారం, నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ తరపున 2 కిలోల బంగారం సమర్పించినట్లు వెల్లడించారు. మొత్తం రూ. 1.75 కోట్ల నగదు అందించగా రూ. కోటి నగదు కాగా, రూ. 75 లక్షల విలువైన చెక్కులు ఉన్నాయి.
ఘట్కేసర్లోని క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున యాదాద్రికి తరలివెళ్లగా ఆలయ ఈవో గీత, అర్చకులు స్వాగతం పలికారు.
- Advertisement -