బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు- మంత్రి మల్లారెడ్డి

142
Minister Malla Reddy
- Advertisement -

మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వాణి దేవికి మద్దతుగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సన్నాహక సమావేశంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మెంబర్ షిప్ డ్రైవ్ మా నియోజకవర్గంలో మూడు రోజుల్లో చేసాం. అలాగే కార్యకర్తలంతా కష్టపడి పనిచేయాలన్నారు. ప్రతి గ్రాడ్యుయేట్ ని కలవాలని మంత్రి సూచించారు.

సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెం. 1గా చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సాగు నీరు ఇచ్చారు. కానీ బీజేపీ హయాంలో దేశాన్ని దివాళా తీశారు. బీజేపీ ఎమ్మెల్సీ 6 ఏళ్లలో ఏంచేశారో చెప్పాలి.. బీజేపీకి ఓటు అడిగే హక్కు లేదు విమర్శించారు. ప్రజలు వాళ్లను తిరస్కరించారు. పీవీ కూతురు ఎందరినో విద్యావంతులను చేసింది. వాణీదేవిని భారీ మెజారిటీతో గెలిపించాలి. 10 రోజులు కష్టపడి మేడ్చల్ నుంచి భారీ మెజారిటీ ఇచ్చి సీఎం కేసీఆర్ కు గిఫ్ట్ ఇద్దామని మంత్రి పేర్కొన్నారు.

బీజేపీకి, కాంగ్రెస్ పార్టీలకు‌ లేని నెట్ వర్క్ మనకుంది. కష్టపడి పని చేస్తే గెలుపు ఖాయం అన్నారు.తెలంగాణ తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. 70 ఏళ్లు కాంగ్రెస్, టీడీపీ అధికారంలో ఉండి ఏమి చేయలేదు.తెలంగాణలో తప్ప దేశంలో ఎక్కడయినా ఉచిత‌ విద్యుత్ 24 గంటలు ఏ రాష్ట్రంలో ఇవ్వట్లేదు,పేదింటి పెళ్లికి లక్షరూపాయలు ఇస్తున్నాం.. బిజెపి నాయకుల అసత్యపు ప్రచారాలు తిప్పి కొట్టాలి. ఎన్నికల మ్యానిపెస్టోలో చెప్పినవి, చెప్పనివి కూడా ఎవరూ అడగపోయినా ప్రభుత్వం చేసింది. టిఆర్ఎస్ పార్టీ మన ఇంటి పార్టీ అని మంత్రి వ్యాఖ్యనించారు.

ఈ కార్యక్రమం లో మంత్రి హరీష్‌ రావు, ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ,ఎమ్మెల్యే కే.పి వివేకానంద, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్ యాదవ్,మున్సిపల్ చైర్మన్లు,కౌన్సిలర్లు,కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్, సీనియర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -