చిరంజీవికి అండగా నిలిచిన మంత్రి కేటీఆర్‌..

161
ktr
- Advertisement -

ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించి వారికి అండగా నిలుస్తారు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌. తాజాగా ఓ వ్యాక్తి దీన స్థితిని తెలుసుకొని చేయూతనిచ్చారు. వివరాల్లోకి వెళితే.. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్‌ కొల్లూరి చిరంజీవి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న చిరంజీవి ఇటీవల గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రిలో చేరారు. చిరంజీవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు.

ఉద్యమకారుడు చిరంజీవి కుటుంబ సభ్యులతో స్వయంగా మాట్లాడిన కేటీఆర్ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి తక్షణ సాయం కింద 10 లక్షల రూపాయలను ఇప్పించారు తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి కుటుంబ సభ్యులు కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -