జలమండలి థీమ్ పార్క్ ను సందర్శించిన మంత్రి కేటీఆర్

519
ktr
- Advertisement -

జూబ్లీహిల్ లోని జలమండలి రెయిన్ వాటర్ హార్వేస్టింగ్ ధీమ్ పార్క్ ను సందర్శించారు ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్. జలమండలి నిర్మించిన థీమ్ పార్క్ ద్వారా విద్యార్థులు , ప్రజల్లో వాటర్ హార్వెస్టింగ్ పైన చైతన్యం కలిగించేలా వివిధ అంశాలతో ఈ పార్క్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా థీమ్ పార్క్ లో ఏర్పాటు చేసిన దాదాపు 42 నీటి సంరక్షణ పద్దతులను మంత్రి పరిశీలించారు. వాటర్ హార్వెస్టింగ్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు తగిన కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.

జలమండలి సిబ్బందికి కార్యక్షేత్రంగా ఉపయోగించుకునేందుకు తయారుచేసిన ప్రత్యేక యూనిఫామ్ జాకెట్ ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. జలమండలి తాగునీటి కొరత , వాన నీటి సంరక్షణ కోసం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం Water Conservation and Leadership కు సంబంధించిన రిజిస్టర్ ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం జల మండలి ఆధ్వర్యంలో నడుస్తున్న పలు ప్రాజెక్టులు కార్యక్రమాలపై అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు.

- Advertisement -