రివ్యూః “హిట్”

2930
hit

ఈనగరానికి ఏమైంది సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విశ్వక్ సేన్. ఆ తర్వాత ఫలక్ నుమా దాస్ మూవీతో హీరో, దర్శకుడు, నిర్మాతగా మారి మంచి విజయం సాధించాడు. విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం హిట్. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వచ్చిన ఈ సినిమాకు మొదటి నుంచి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. రాజమౌళి, అనుష్క లాంటి స్టార్స్ ఈమూవీని ప్రమోట్ చేయడంతో హైప్ క్రియేట్ అయ్యింది. అ!సినిమాతో నిర్మాతగా మారిన నాని ఈసినిమాను నిర్మించారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రుహాని శర్మ హీరోయిన్ గా చేసింది. శైలేష్ అనే కొత్త దర్శకుడు ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. గత సినిమాలకు భిన్నంగా నటించిన విశ్వక్ సేన్ ఈమూవీతో ప్రేక్షకుల మసను గెలుచుకున్నాడా? నిర్మాతగా నాని మరోసారి సక్సెస్ అయ్యాడో లేదో తెలుసుకుందాం.

 Hit

కథః

విక్రమ్ రుద్రరాజు (విశ్వక్ సేన్) ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్. ఎలాంటి క్లిష్టమైన కేసునైనా క్షణాల్లో పరిష్కరిస్తుంటాడు. హోమీసైడ్‌ ఇంటర్‌వెన్షన్‌ టీమ్‌(హిట్‌) పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విభాగంలో విక్రమ్ రుద్రరాజు పనిచేస్తుంటాడు. ఫోరెన్సిక్ విభాగంలో పనిచేసే నేహా(రుహానిశర్మ)ను ప్రేమిస్తుంటాడు రుద్రరాజు. గతంలో జరిగిన కొన్ని అనుభవాల వల్ల ఏ చిన్న క్రైమ్ ను చూసినా కూడా తెలియకుండానే ప్యానిక్ అవుతుంటాడు. దానివల్ల అనారోగ్యం పాలవుతాడు. డాక్టర్ల కోరిక మేరకు ఆరునెలలు ఉద్యోగానికి సెలవు పెడతాడు. హఠాత్తుగా ఓ రోజు నేహా కనిపించడం లేదని అతడికి ఫోన్‌ వస్తుంది. ప్రితి అనే అమ్మాయి మిస్సింగ్ అయిన మాదిరిగానే నేహా కూడా అదృశ్యం అవుతుంది. వీరిద్దరి మిస్సింగ్ ను విక్రమ్ రుద్రాజు ఎలా చేధించాడన్నదే ఈసినిమా కథ.

ప్లస్ పాయింట్స్ః
ఈమూవీలో విశ్వక్ సేన్ నటన అద్భుతం అని చెప్పుకోవాలి. ఇప్పటివరకు మాస్ యాంగిల్ కనిపించిన విశ్వక్ ఈసినిమాలో ఇన్వేస్టిగేటివ్ ఆఫిసర్ గా అదరగొట్టాడు. సినిమా మొదలైనప్పటి నుంచి ఎండ్‌ కార్డు పడే వరకు కూడా ప్రేక్షకుడు నెక్ట్స్ ఏంటి అని ఆసక్తిగా ఎదురుచూస్తాడు. రుహానీ శర్మది చిన్న పాత్రే. కానీ ఉన్నంత సేపు బాగానే ఉంది. మరో కీలక పాత్రలో మురళీ శర్మ బాగా నటించాడు. ఈమూవీలో పాటలకు పెద్దగా ఆస్కారం లేనప్పటికి బ్యాక్ రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మరోసారి తన మార్క్ చూపించాడు. ఇక దర్శకుడు శైలేష్ చాలా బాగా తెరకెక్కించాడు. తొలి సినిమానే క్రైమ్ ను ఎంచుకుని సక్సెస్ సాధించాడు.
మైనస్ పాయింట్స్ః
మధ్యలో కొంచెం కథ బోరింగ్ గా ఉంటుంది. సినిమా నిడివి కూడా ఎక్కువ సేపు ఉండటంతో ఇన్వెస్టిగేషన్ సమయంలో కాస్త ల్యాగ్ అవుతుంది. బలమైన క్లైమాక్స్ లేకకోవడం ఈసినిమాకు మైనస్ గా చెప్పుకోవచ్చు..
తీర్పుః చివరగా హిట్ మూవీలో నటించి తన ఖాతాలో మరో హిట్ ను సొంతం చేసుకున్నాడు హీరో విశ్వక్ సేన్.

విడుదల తేదీ: 28/02/2020
రేటింగ్:2. 5/5
నటీనటులు: విశ్వక్‌సేన్‌, రుహానీ శర్మ,మురళీశర్మ, తదితరులు
సంగీతం: వివేక్ సాగర్
నిర్మాత: నాని, ప్రశాంతి త్రిపురనేని
దర్శకత్వం: శైలేష్‌ కొలను