- Advertisement -
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రేపు సూర్యపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు యాదాద్రి జిల్లాలోని చౌటుప్పల్ మండలం దండుమల్కాపుర్ గ్రామంలో గ్రీన్ ఇండస్ట్రీయల్ పార్క్ ను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. కాగా మధ్యాహ్నం సూర్యపేటలోని మంత్రి జగదీశ్ రెడ్డి నివాసంలో భోజనం చేయనున్నారు.
ఆ తర్వాత హుజుర్ నగర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయనున్నారు. 4గంటలకు నెరేడు చర్ల మున్సిపాలిటిలో అభివృద్ది పనులకు శంకుస్ధాపనలు చేయనున్నారు. ఈకార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డితో పాటు హుజుర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, ఎమ్మెల్సీ లు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొనున్నారు.
- Advertisement -