యాదాద్రి పునర్నిర్మాణం అద్భుతం.. కేటీఆర్ ట్వీట్..

150
ktr
- Advertisement -

యాద్రాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణాన్ని సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. భవిష్యత్ తరాల వారు గొప్పగా చెప్పుకునేలా యాదాద్రి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. అడుగడుగునా ఆధ్యాత్మిక ఉట్టిపడేలా ఆగమ, శిల్పశాస్త్ర ప్రకారం అక్కడ ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.

ప్రధానాలయంతోపాటు చుట్టూ ప్రాకారాల తుది మెరుగుల పనులు చకాచకా సాగుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే యాదాద్రి రూపురేఖలే మారిపోయాయి. భూతల స్వరంలా మారిపోయింది. మరి ఇప్పుడు యాదాద్రి నరసింహ స్వామి ఆలయం ఎలా ఉంది.? పునర్నిర్మాణం తర్వాత ఎలా మారింది.? ఆ వీడియోను మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో షేర్ చేశారు.

యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణం సీఎం కేసీఆర్ డ్రీమ్ ప్రాజెక్ట్. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులు వంటి ఆధునిక ఆలయాలను నిర్మిస్తూనే.. మరోవైపు యాదాద్రి ఆలయాన్ని ప్రపంచస్థాయి ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -