నెట్టింట దూసుకుపోతున్న ‘డీ కంపెనీ’ టీజర్‌..

54
D COMPANY Teaser

వివాదాలకు కేరాఫ్ గా చెప్పుకునే దర్శకుడు రామ్‌ గోపాల్ ‌వర్మ.వర్మ తాజాగా రూపొందిస్తున్న చిత్రం ‘డీ కంపెనీ’. ది మహాభారత్ ఆఫ్‌ అండర్ వరల్డ్ అని క్యాప్షన్ కూడా పెట్టారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఆర్జీవీ శనివారం ట్విటర్ లో విడుదల చేశారు.

ఇందులో దావూద్ ఇబ్రహీం చిన్న గ్యాంగ్‌ లీడర్‌ నుంచి పెద్ద గ్యాంగ్‌ స్టర్‌గా ఎలా ఎదిగాడన్న నేపథ్యంలో ‘డీ కంపెనీ’ తెరకెక్కుతోంది. డైలాగ్స్‌ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌తో టీజర్‌ను విడుదల చేశారు. స్పార్క్ కంపెనీ అధినేత స్పార్క్ సాగర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నిన్న విడుదలైన ఈ టీజర్ నెట్టింట దూసుకెళుతోంది. ఇప్పటికే దాదాపు 17 లక్షల వ్యూస్ ను తెచ్చుకోవడం గమనార్హం.

A Peek into D COMPANY - Official Teaser ( Telugu ) | RGV | Spark Productions | #RGVLatest