సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌ పర్యటన…

236
- Advertisement -

మంత్రి కేటీఆర్ ఈ నెల 8న రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్ధాపన చేయనున్నారు.ఉదయం 11:00గంటలకు వీర్నపల్లి మండలం కంచర్లలో 33/11 కేవీ సబ్ స్టేషన్ ప్రారంభించనున్నారు.

ఉదయం 11:30గంటలకు వీర్నపల్లి రాశిగుట్ట తండా టూ భూక్యతండా బ్రిడ్జి ప్రారంభోత్సవం….మధ్యాహ్నం 12:00 గంటలకు మద్దిమల్ల జడ్పీ రోడ్ టూ గుగులోతు తండా వీర్నపల్లి బ్రిడ్జిని ప్రారంభించనున్నారు.

మధ్యాహ్నం 12:30 గంటలకు మద్దిమల్ల టూ సోమరంపేట రోడ్డులో బ్రిడ్జి ప్రారంభోత్సవం….మధ్యాహ్నం 1:00 గంటలకు వీర్నపల్లి మండలం రంగంపేటలో భూ పట్టాలను పంపిణీచేయనున్నారు. మధ్యాహ్నం 1:30 గంటలకు గర్జనపల్లిలో రైతు వేదిక,మధ్యాహ్నం 2:00 గంటలకు వన్ పల్లి టూ చీమన్ పల్లి బ్రిడ్జి,మధ్యాహ్నం 2:30గంటలకు వన్ పల్లి టూ శాంతినగర్ బ్రిడ్జి ప్రారంభించనున్నారు.

- Advertisement -