సినీ నటి, ఎంపీ సుమలతకు కరోనా…

63
sumalatha

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి పంజా విసురుతోంది. రోజుకు వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతుండగా ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసుల్లో మూడోస్ధానంలో ఉంది భారత్.

ఇప్పటికే పాజిటివ్‌ కేసులు దేశంలో ఏడు లక్షలు దాటగా తాజాగా సినీ నటి, కర్ణాటక మాండ్యా ఎంపీ సుమలతకు కరోనా సోకింది. కరోనా లక్షణాలతో టెస్టు చేయించుకున్న ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడించారు. ఇక ఈవిషయాన్ని ట్విట్టర్ ద్వారా కూడా వెల్లడించారు సుమలత. తనను కలిసిన అధికారులు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు సుమలత.

కరోనా,లాక్ డన్ సమయంలో తన నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను సందర్శించి,ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే ఆమెకు కరోనా సోకగా డాక్టర్ల సలహాతో హోం క్వారంటైన్‌లో చికిత్స తీసుకుంటున్నారు.