వరంగల్‌ను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దుతాం- ఎర్రబెల్లి

516
errabelli dayakar
- Advertisement -

రేపు మంత్రి కేటీఆర్ వరంగల్ అర్బన్ జిల్లా పర్యటన నేపథ్యంలో భద్రకాళి బండ్ వద్ద ఏర్పాట్లను మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు. ఈ కార్యక్రమలో చైర్మన్ మర్రి యాదవరెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, సీపీ రవీందర్, మున్సిపల్ కమిషనర్ రవి కిరణ్ ఆయనతో పాటు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ మాట్లాడుతూ.. రేపు మంత్రి కేటీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సుమారు 500కోట్ల పనులకు కేటీఆర్ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. వరంగల్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారని మంత్రి అన్నారు.

భద్రకాళి బండ్‌ని అత్యంత వైభవంగా తీర్చిదిద్దాం.తెలంగాణలోనే అద్భుతమైన పర్యటక కేంద్రం అవుతుంది. ప్రజల అవసరాలకు అనుగుణంగా పకడ్బందీగా మాస్టార్ ప్లాన్ రూపొందిస్తాం. మాస్టర్ ప్లాన్‌పై ప్రజలు తమ అభిప్రాయాలను కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కి అందించాలి.వరంగల్ ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దుతామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

- Advertisement -