రామోజీరావుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు..

460
ktr
- Advertisement -

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఈ నేపథ్యంలో కరోనాపై పోరాటం చేస్తున్న తెలుగు రాష్ట్రాలకు ఎంతోమంది ప్రముఖులు తమ వంతుగా ఆర్థిక సాయం అందిస్తూ ప్రభుత్వనికి చేయూతనిస్తున్నారు. ఇందులో భాగంగా ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు విరాళాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌కు రూ. 10 కోట్ల చొప్పున మొత్తం రూ. 20 కోట్ల విరాళాన్ని ప్రకటించారు.

ఈ సందర్భంగా రామోజీరావుకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. కరోనాపై ప్రభుత్వ పోరుకు మద్దతుగా నిలిచి.. రూ. 10 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ప్రకటించినందుకు రామోజీరావుకు కేటీఆర్‌ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ బారిన పడ్డ వారిని ఆదుకునేందుకు పలు సంస్థలు సీఎం సహాయనిధికి విరాళాలు ప్రకటిస్తున్నారు.

- Advertisement -