మ‌రోసారి అల్లు అర్జున్ తో హ‌రీశ్ శంక‌ర్!

173
Allu Arjun Fire On DJ Movie Director Harish Shankar

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన గ‌బ్బ‌ర్ సింగ్ సినిమాతో బ్లాక్ బాస్ట‌ర్ హిట్ కొట్టాడు ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్. ఆ త‌ర్వాత ఆయ‌న తీసిన సినిమాలు పెద్ద‌గా విజ‌యం సాధించ‌లేదు. ఇటివ‌లే వ‌రుణ్ తేజ్ తో గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేశ్ అనే సినిమాను తీశాడు. ఈమూవీ మంచి విజ‌యం సాధించింది. కాగా ఈ మూవీ త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ ఎవ‌రితో సినిమా చేస్తాడ‌న్న‌ది ఇంకా స్ప‌ష్టం కాలేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో మ‌రో మూవీ తీస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చినా అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డలేదు.

తాజాగా ఉన్న స‌మాచారం మేర‌కు హ‌రీశ్ శంక‌ర్ అల్లు అర్జున్ తో మ‌రో సినిమా చేయ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. హ‌రీశ్ శంక‌ర్ చెప్పిన క‌థ బ‌న్నీకి న‌చ్చ‌డంతో ఒకే చేశాడ‌ని స‌మాచారం. బ‌న్నీ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శక‌త్వంలో సినిమా చేస్తున్నాడు. ఈమూవీ త‌ర్వాత హ‌రీశ్ శంక‌ర్ తో మ‌రో చేసే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలుస్తుంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమా తెర‌కెక్కింది. ఈమూవీ మంచి విజ‌యం సాధించింది.