పాలమూరులో మంత్రి కేటీఆర్ పాదయాత్ర

388
ktrpalamuru
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ లో ప్రారంభించారు ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌. పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ కలిసి మహబూబ్ నగర్ పట్టణంలో పర్యటించారు. పట్టణంలోని పాత తోట రోడ్డులో కేటీఆర్ పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు పాల్గోన్నారు. పాదయాత్రలో భాగంగా ఇంటి ముందు కూర్చున్న వృద్దులతో ముచ్చటించారు కేటీఆర్. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో వారిని అడిగా తెలుసుకున్నారు.

ktr

పలువురు స్ధానిక ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లు, కల్యాణలక్ష్మితో పాటు ఇతర పథకాలు అందుకుంటున్నామని వృద్ధులు.. కేటీఆర్‌కు చెప్పి సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు నగరానికి చేరుకున్న మంత్రి కేటీఆర్ పలు అభివృద్ది పనులకు శంకుస్ధాపన చేశారు. జిల్లా కేంద్రంలోని డైట్‌ కాలేజీ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌ను, ప్రభుత్వాసుపత్రి సమీపంలో నిర్మించిన పబ్లిక్‌ టాయిలెట్స్‌ను, ఆర్‌ అండ్‌ బీ ఆధ్వర్యంలో నిర్మించిన బీటీ రోడ్డు మరియు సెంట్రల్‌ మీడియన్‌, రైల్వేస్టేషన్‌ నుంచి డీఈవో ఆఫీసు వరకు నూతనంగా నిర్మించిన రోడ్డును కేటీఆర్‌, శ్రీనివాస్‌గౌడ్‌ కలిసి ప్రారంభించారు.

ktr new

- Advertisement -