మిర్యాలగూడ అభివృద్ధికి రూ.200కోట్లు…

245
- Advertisement -

మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్‌ నేడు ప్రారంభించారు. నల్లగొండలో జిల్లా పర్యటనలో ఉన్న కేటీఆర్‌ మిర్యాలగూడలో పర్యటించిన సందర్భంగా..పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ..మిర్యాలగూడ అభివృద్ధి కోసం రూ.200కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. రెండు విడతల్లో రూ.200 కోట్లు మంజూరు చేస్తామని తెలిపారు.

29791686_2076253645919356_7278522670107059921_n

కాగా..బస్సు యాత్రలో కాంగ్రెస్‌ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని,కాంగ్రెస్‌కు మళ్ళీ అధికారం వస్తుందని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రజలను పట్టించుకోలేదని, గతంలో పంటలకు కనీస మద్దతు ధర రాని పరిస్థితి ఉండేదన్నారు. రాష్ట్ర విభజన జరిగితే విద్యుత్‌ కొరత ఏర్పడుతుందని అన్నారని కేటీఆర్‌ మండిపడ్డారు.

పేదింటి ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళకు రూ.1,00116 చొప్పున తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నదని, రైతన్నకు 2 పంటలకు రూ.4వేల చొప్పున ఇస్తున్న ఏకైన రాష్ట్ర తెలంగాణ అని పునరుద్ఘాటించారు కేటీఆర్‌. ఈ కార్యక్రమంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -