KTR:కేంద్రంలో సంకీర్ణమే

26
- Advertisement -

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని తేల్చి చెప్పారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ మన్నెగూడలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవంలో మాట్లాడిన కేటీఆర్…కేంద్రంలో ఏర్పడబోయే సంకీర్ణ ప్ర‌భుత్వంలో బీఆర్ఎస్ పాత్ర తప్పకుండా ఉంటుందన్నారు.

ఇప్పుడున్న కేంద్ర ప్ర‌భుత్వానికి నేత‌న్న‌ల గురించి తెల్వ‌దు అన్నారు. తెలంగాణ‌లో ఇంటిరీయ‌ర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాల‌జీ ఏర్పాటు కావాలంటే మ‌న ప్ర‌భుత్వం ఉండాలన్నారు.ఎవ‌రైతే మీకు క‌ష్ట‌కాలంలో అండ‌గా ఉన్నారు వారిని త‌ప్ప‌కుండా ఆద‌రించండి. త‌ప్ప‌కుండా భ‌విష్య‌త్‌లో ప్ర‌భుత్వం మీకు వెన్నంటి న‌డుస్తుంది రాష్ట్రంలో తిరిగి త‌ప్ప‌కుండా కేసీఆరే ముఖ్య‌మంత్రి అవుతారన్నారు.

చేనేత మీద 5 శాతం జీఎస్టీ వేసిన మొట్ట‌మొద‌టి ప్ర‌ధాని మోడీ అని.. చేనేత వ‌ద్దు.. అన్ని ర‌ద్దు అనేలా కేంద్రం తీరు ఉంద‌ని ధ్వ‌జ‌మెత్తారు. కేంద్రం చేనేత‌కారుల‌పై మ‌రిన్ని భారాలు వేస్తుంద‌ని ఇది గమనించాలన్నారు.చేనేతల బాధలను గుర్తించే సీఎం కేసీఆర్ చేనేత‌కు చేయూత ప‌థ‌కం తీసుకొచ్చారన్నారు.

Also Read:ఇంతకీ, త్రివిక్రమ్ ఏం చేస్తున్నట్టు?

- Advertisement -