- Advertisement -
మహేంద్ర యూనివర్సిటీ ఇన్నోవేషన్ కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి అని సూచించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌కు సమీపంలోని బహదూర్‌పల్లిలో మహీంద్రా విశ్వవిద్యాలయం శుక్రవారం ప్రారంభమైంది. ఆనంద్ మహీంద్రాతో కలిసి ఐటీ మంత్రి కేటీఆర్ వర్చువల్‌గా యూనివర్సిటీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్….మహీంద్రా గ్రూప్ కి అభినందనలు తెలిపారు. మహీంద్రా గ్రూప్ సంస్థల మాదిరే యూనివర్సిటీ సైతం అత్యున్నత అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలను నెలకొల్పుతుండన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఆనంద్ మహీంద్రా మాట్లాడుతూ.. నూతనంగా యూనివర్సిటీని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. భావితరాలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. మహీంద్రా యూనివర్సిటీకి ఆనంద్ మహీంద్రా వీసీగా వ్యవహరించనున్నారు. 130 ఎకరాల విస్తీర్ణంలో వర్సిటీని ఏర్పాటు చేశారు.
- Advertisement -