మత పిచ్చిలో ఆగం కావొద్దని యువతకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఖమ్మంలో పలు అభివృద్ధి కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడిన కేటీఆర్.. ఇవాళ మన దేశంలో ఏం జరుగుతుందో యువత ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. కరెంట్, నీళ్లు లేని గ్రామాల గురించి ఆలోచించాలి. పిల్లల ఉద్యోగాల గురించి ఆలోచించాలి. కానీ కులం, మతం పేరిటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తూ, పచ్చగా ఉన్న దేశంలో చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చలి మంటలను కాచుకోని, నాలుగు ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
1987లో భారతదేశం ఆర్థిక పరిస్థితి, చైనా ఆర్థిక పరిస్థితి సేమ్. కానీ ఈ 35 ఏండ్ల తర్వాత చూస్తే.. చైనా 16 ట్రిలియన్ డాలర్లతో ముందుకు దూసుకుపోయింది..మనం ఎక్కడ ఉన్నామో ఆలోచించాలన్నారు. ప్రపంచంలోనే నంబర్ వన్‌గా చైనా ఎదిగితే మనకేమో కుల పిచ్చి, మత పిచ్చి ఎక్కువైపోయి…అభివృద్ధి అడుగంటి పోయిందన్నారు.
ఖమ్మంలో ఒకేరోజు రూ. 100 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఖమ్మం నగరాన్ని నెంబర్‌వన్‌గా మార్చాలన్నది మంత్రి అజయ్ లక్ష్యమని స్పష్టం చేశారు.