నల్గొండ,రామగుండంలో ఐటీ హబ్‌లు: మంత్రి కేటీఆర్

303
ktr
- Advertisement -

త్వరలో నల్గొండ, రామగుండంలో ఐటీ హబ్‌లు నిర్మిస్తామని తెలిపారు మంత్రి కేటీఆర్. ఖమ్మం ఐటీ హబ్‌లో మాట్లాడిన కేటీఆర్…ఐటీ రంగం ఎదగడానికి సీఎం కేసీఆర్ నాయకత్వం కారణం అన్నారు. కేసీఆర్ కృషి వల్ల పెట్టు బడులు తరలి వచ్చాయని…దక్షత కలిగిన ముఖ్యంమంత్రి….కేసీఆర్ అన్నారు.

స్టేబుల్ గవర్నమెంటు వల్ల పెట్టుబడులు , ఐటీ పరిశ్రమ అభివృద్ధి జరిగిందన్నారు. 50 వేల కోట్లు ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు లక్షా 1.40 వేల కోట్ల కు ఐటీ ఎగుమతులు పెరిగాయని…..ఢిల్లీ , ముంబాయి, బెంగుళూరు ను కాదని ఐటీ పరిశ్రమలు హైదరాబాద్ తరలివస్తున్నాయని చెప్పారు.

తెలంగాణలో వరంగల్ , ఖమ్మం. , మబబూబ్ నగర్ లో ఐటీ హబ్ లు నిర్మించామని…తర్వాత నల్లగొండ , రామగుండ లో ఐటీ హబ్ లు ఏర్పాటు చేస్తం అన్నారు.అజయ్ కూమార్ పట్టుబడితే వదలడు .. ఏ పని కావాలంటే అది పూర్తి అయ్యే వరకు వదలడన్నారు. ఎక్కడ యువతకు అక్కడే ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం ఆలోచన అని తెలిపిన కేటీఆర్…టీ ఫైబర్ ద్వారా ప్రతి ఇంటి ఇంటర్నెట్ ఇస్తం అన్నారు. డిజిటల్ ఇన్ ఫ్రాక్చర్ ద్వారా మెరుగైన సేవలు అందిస్తాం అని స్పష్టం చేశారు.

- Advertisement -