భారత టెక్కీలకు ఊరట..

176
biden
- Advertisement -

భారత టెక్కీలకు భారీ ఊరట లభించింది. హెచ్‌–1బీ వీసాల నిషేధంపై గడువు ముగిసిన నేపథ్యంలో కొత్తగా ఎలాంటి పొడిగింపు ఉత్తర్వులు జారీ చేయలేదు బైడెన్ సర్కార్‌. దీంతో వివిధ దేశాలకు చెందిన టెక్కీలు ఊపిరిపీల్చుకున్నారు.

గత ఏడాది కరోనా సంక్షోభం తీవ్రస్థాయికి చేరుకొని ప్రపంచ మార్కెట్లు మూతపడిన సమయంలో ట్రంప్‌ హెచ్‌–1బీ సహా వలసేతర వీసాలపై తాత్కాలిక నిషేధాన్ని విధించారు. తొలుత డిసెంబర్‌ 31వరకు ఆ తర్వాత ఆ నిషేధాన్ని మార్చి 31 వరకు పొడిగించారు. తాను అధికారంలోకి వస్తే వీసాలపై నిషేధాన్ని ఎత్తివేస్తానని బైడెన్‌ హామీ ఇచ్చారు.

హెచ్‌1బీపై నిషేధం కొనసాగితే అమెరికా ఆర్థిక వ్యవస్థకే నష్టమని, నిపుణులైన పనివారు దొరకరని కొందరు వాదిస్తే, తక్కువ వేతనాలకే విదేశీ ఉద్యోగులు దొరకడం వల్ల స్థానికులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని మరికొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -