సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో అత్యధికంగా 940 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో రూ.2.25 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ భవనాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యను మొక్కుబడిగా అందించకుండా, ప్రపంచంతో పోటీ పడే విధంగా విద్యను అందిస్తున్నామని తెలిపారు. ప్రతీ విద్యార్థికి సన్నబియ్యంతో భోజనం పెట్టే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు జ్యోతిబాపులే, అంబేడ్కర్ ఓవర్సీస్ కింద ఫీజు రియింబర్స్‌మెంట్ ఇస్తున్నామని తెలిపారు. సినారే పేరు మీద ఏర్పాటు చేసిన లైబ్రరీ పోటీ పరీక్షలకు వేదికగా మారిందన్నారు.
ఎల్లారెడ్డిపేటలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసే బాధ్యత తనది అని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల మందికి ఉపాధిని కల్పించామని….. ప్రతి ఒక్కరికి స్కిల్, రీ స్కిల్, అప్ స్కిల్ ఉండాలి….. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు.