- Advertisement -
మహిళల ఆరోగ్యం కోసం ఫెర్రింగ్ సంస్థ చేస్తున్న కృషి అభినందనీయం అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో స్విట్జర్లాండ్‌కు చెందిన ఫెర్రింగ్ ఔషధరంగ సంస్థ ఏర్పాటు చేసిన ఫెర్రింగ్ ఫార్మాస్యూటికల్స్‌ను మంత్రి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…లైఫ్‌సైన్సెస్ సెక్టార్‌లో హైదరాబాద్ మరింత పురోగమిస్తుందన్నారు. ప్రపంచంలోనే ఉన్నత ప్రమాణాలతో జీనోమ్ వ్యాలీ నడుస్తుందని…. 30 బిలియన్ యూరోలతో ఫెర్రింగ్ కంపెనీ ఏర్పాటయిందన్నారు.
స్విట్జర్లాండ్ వేదికగా కంపెనీ కార్యకలాపాలు కొనసాగుతాయని వెల్లడించారు. ఇందులో తల్లీబిడ్డల ఆరోగ్యానికి అవసరమైన మందులు తయారవుతాయని వెల్లడించారు.
- Advertisement -