మొక్కలు నాటకపోతే భవిష్యత్‌లో తీవ్ర పరిణామాలు: కేటీఆర్

222
ktr
- Advertisement -

చెట్లను సంరక్షించకపోతే భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కునే పరిస్ధితి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో 200 ఎకరాల్లో 69 వేల మొక్కలు నాటే హరితహార కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు మంత్రి కేటీఆర్.ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్ …మొక్కల ప్రాధాన్యతను సీఎం కేసీఆర్ గుర్తించినంతగా మరెవరూ గుర్తించలేదన్నారు. నీళ్లు కొనుక్కునే తాగే రోజులొస్తాయని ఆనాడు బ్రహ్మంగారు చెప్పిన మాటలు నిజమవుతాయని ఎవరూ అనుకోలేదన్నారు.

చెట్లు సంరక్షించకపోతే భవిష్యత్తులో గాలి కూడా కొనుక్కునే రోజులు వస్తాయని…మొక్కలు నాటకపోతే భవిష్యత్తులో తీవ్ర విపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పుట్టినప్పుడు ఊగే ఊయల నుంచి చనిపోయినప్పుడు కాల్చే కట్టె వరకు చెట్లు మనిషికి ఎంతో అవసరం….తెలంగాణలోని ఫారెస్టు కవరేజ్ ఏరియాను 33 శాతానికి పెంచాలన్న లక్ష్యంతో హరితహారం సాగుతోందన్నారు.

180 కోట్లకు పైగా మొక్కలు ఇప్పటి వరకు నాటాం. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. గ్రామాల్లో పెట్టిన మొక్కల్లో 85 శాతం బతకపోతే సర్పంచి పదవి పోయేలా పంచాయితీ రాజ్ చట్టం తెచ్చామన్నారు.

అన్ని రకాల రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి…మియావాకీ టెక్నాలజీతో కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నారు. తెలంగాణలోని హరిత శాతాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.కరోనావల్ల ప్రపంచమంతా ఆందోళనతో ఉన్నా.. మనం దానితో సహజీవనం సాగిస్తూనే మిగతా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నాం.ఇంతటి కష్టకాలంలో కూడా పేదలు, రైతులకు సంబంధించిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఆపకుండా ముందుకు తీసుకెళ్తున్నాం అన్నారు.

వేల కోట్ల రూపాయలతో వడ్ల కొనుగోళ్లు పూర్తి చేసాం…ఇప్పుడు ఎలాంటి ఎన్నికలు లేవు. రాబోయే నాలుగేళ్లు పూర్తి స్థాయిలో అభివృద్ధిపైనే దృష్టి సారిస్తాం అన్నారు. రాజకీయాలకు అతీతంగా హరితహారంలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వాములు కావాలి….12750 గ్రామాలకు మొక్కల సంరక్షకు కావాల్సిన ట్యాంకర్లు ఇతర వసతులు సమకూర్చాం అన్నారు. 338 కోట్లు ప్రతి నెల అన్ని గ్రామ పంచాయితీల అభివృద్ధి కోసం కేటాయిస్తున్నారు.

..చొప్పదండి నియోజకవర్గంలోని మోతె ప్రాంతానికి సాగునీరు అందిస్తాం అన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆనాడు దాశరథి అంటే.. ఇప్పుడు నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణ కావాలని కేసీఆర్ కలలు కంటున్నారని చెప్పారు.

- Advertisement -