పెట్టుబడుల గమ్యస్థానం…తెలంగాణ

59
- Advertisement -

హైదరాబాద్లోని కొంగరకలాన్ లో Foxconn ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి, Foxconn interconnect technology చైర్మన్ అండ్ సీఈవో సిడ్నీ లూ, ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్.. తెలంగాణను తమ తయారీ కేంద్రంగా ఎంచుకున్న ఫాక్స్ కాన్ చైర్మన్ సీడ్నీ లు మరియు కంపనీ ప్రతినిధి బృందానికి ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ నిర్మాణంలో తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుంది. రానున్న తొమ్మిది నెలల్లోని ఈ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించుకోవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహకరిస్తుందన్నారు. ఈరోజు ఈ కంపెనీ శంకుస్థాపన తెలంగాణా చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈరోజు కంపెనీతో ప్రారంభమైన ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరింతగా విస్తరిస్తుందన్న నమ్మకం ఉంది. కంపెనీ తమ తయారీ ప్లాంట్లను భవిష్యత్తులోనూ విస్తరించెందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం తనదైన వినూత్నమైన పరిశ్రమల అనుమతుల ప్రక్రియ టిఎస్ ఐపాస్ ద్వారా ఇప్పటికే దేశంలో ప్రశంసలు పొందుతుందన్నారు. గత తొమ్మిది సంవత్సరాలు తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. దేశంలోనే ఆకర్షణీయమైన పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. తెలంగాణ ఫర్ క్యాపిట 2.5 రెట్లు పెరిగిందిదాదాపు 22, 700 పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించాము. 50 బిలియన్ డాలర్ల పెట్టుబడి తో 23 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఈరోజు భారతదేశం 30 సంవత్సరాల కింద చైనా ఉన్న పరిస్థితిలో ఉంది. కానీ ప్రభుత్వాలు అనుకుంటే 20 సంవత్సరాల్లోనే చైనా సాధించిన ప్రగతిని సాధించేందుకు అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఈ దిశగా పనిచేస్తే 2040 నాటికి తలసరి ఆదాయాన్ని ఆరు రెట్లు పెంచి 20వేల డాలర్లకు చేర్చాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు.

Also Read:IPL 2023 : ఆర్సీబి ప్లే ఆఫ్ కు వెళ్తుందా ?

దేశంలో గత సంవత్సరం వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాల్లో మూడింటిలో ఒకటి తెలంగాణలోనే వచ్చింది. దేశంలో గత ఏడాది వచ్చిన టెక్నాలజీ ఉద్యోగాలు 33% తెలంగాణ నుంచి ఉండడం గర్వకారణం అన్నారు. ఎలక్ట్రానిక్స్ రంగాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యత రంగంగా గుర్తించింది… చైనా మాదిరి ఎలక్ట్రానిక్స్ తయారీ రంగాన్ని ప్రోత్సహించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నాం అన్నారు. ఫాక్స్ కాన్ చైర్మన్ తెలంగాణ వేగంపైన ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం మా పైన ఉన్నది. ఆ దిశగా పనిచేస్తాం… ఈ కంపెనీ తెలంగాణకి రావడంలో కీలక పాత్ర వహించిన తెలంగాణ ప్రభుత్వ అధికారుల బృందానికి మనస్పూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను అని చెప్పారు.

500 మిలియన్ డాలర్లను తెలంగాణలో ఇన్వెస్ట్ చేస్తున్నందుకు ఫాక్స్ కాన్ కంపెనీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఫాక్స్ కాన్ కంపెనీ అనుభవాలకు work experience కి మించి అద్భుతమైన ప్రస్థానం ఇక్కడ కొనసాగుతుందన్న నమ్మకం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోని ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి నాయకత్వం వహించేలా.. మార్గదర్శకంగా ఉండేలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పనిచేస్తుందన్నారు. రానున్న 10 సంవత్సరాలలో 15 లక్షల ఉద్యోగ అవకాశాలను ఎలక్ట్రానిక్స్ రంగంలో ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నాం… అత్యున్నత నైపుణ్యం కలిగిన టెక్నాలజీ రంగంలో ఇక్కడి యువతకు శిక్షణ ఇచ్చేలా foxcon ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న అన్నారు.

- Advertisement -