హైదరాబాద్‌లో మొబిలిటీ క్లస్టార్ ఏర్పాటు- మంత్రి కేటీఆర్

72
- Advertisement -

బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ ప్రభుత్వం ఫార్ములా ఇ – గ్రీన్‌కోతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ రెండు సంస్థల ఒప్పంద ఎమ్ఒయు సంతకాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, వాణిజ్యం మరియు MA&UD శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ హాజరైయ్యారు. ఈ కార్యక్రమంలో ఫార్ములా ఇ అసోసియేషన్, గ్రీన్‌కో నాయకత్వ బృందంలతో పాటు ఐటీ మరియు పరిశ్రమల శాఖలకు చెందిన సీనియర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగామాంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఇతర నగరాలతో పోటీ పడి హైదరాబాద్ ఫార్ములా ఇ రేస్‌కు వేదికైంది. నవంబర్ నుండి మార్చి మధ్యలో ఫార్ములా ఇ రేస్ కు హైదరాబాద్ ఆతిధ్యం ఇవ్వనుంది. హైదరాబాద్‌లో త్వరలో మొబిలిటీ క్లస్టార్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఈ సంవత్సరాంతంలో ఫార్ములా ఇ రేస్ హైదరాబాద్‌లో జరగనుంది. ఈ సందర్భంగా నగరంలో మూడురోజుల పాటు ఈవీ ఎక్స్పో నిర్వహిస్తాం. తద్వారా ఇక్కడి పెట్టుబడి అవకాశాలు, టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ కంపెనీలకు వివరిస్తామన్నారు.

ఫాస్టెస్ట్ growing స్పోర్ట్ ఫార్ములా ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీను ప్రోత్సహించే రేస్ ఫార్ములా ఈ ..సీతారాంపూర్, దివిటిపల్లి, షాబాద్‌లో ఈవీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. కార్బన్ ఉద్గారాలు తగ్గించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అప్పుడే మెరుగైన భవిష్యత్తు మన సొంతం అవుతుంది. ఫార్ములా ఈ రేసింగ్ హైదరాబాద్ ఈవీ గమనంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

- Advertisement -