ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. నిజామాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పసుపు బోర్డు ప్రకటించిన సందర్భంగా ఏర్పాటు చేసే సభలో పాల్గొని మాట్లాడనున్నారు మోడీ. ఈ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ప్రధానమంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు కేటీఆర్.
మా కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రాణం పోసేదెప్పుడు?, బయ్యారం ఉక్కు కర్మాగారం నిర్మించేదెప్పుడు?, మా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా దక్కేదెప్పుడు? ..ఈ విభజన హామీలపై మోడీ స్పందించాలని డిమాండ్ చేశారు. పదేళ్ల నుంచి పాతరేసి.. ఎంతకాలం ఈ అబద్ధాల జాతర, మీ మనసు కరిగేదెప్పుడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోచ్ ఫ్యాక్టరీ, ఉక్కు కర్మాగారం ఉపిరి తీశారని, లక్షల ఉద్యోగాలిచ్చే ఐటీఐఆర్‌ను ఆగం చేశారని విమర్శించారు. పదేండ్ల పాలనలో 4 కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు.. 140 కోట్ల భారతీయులను మోసం చేశారన్నారు. ప్రధాని ప్రకటించిన పసుపు బోర్డు ప్రకటన కూడా మహిళా రిజర్వేషన్ మాదిరిగానే ఉందన్నారు.
Also Read:ఇండియా బలం స్పిన్నా.. పేసా?