గ్రేటర్ ఎన్నికల్లో అభివృద్ధి కావాల…?అరాచకం కావాలా..? ప్రజలు తేల్చుకోవాలని పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ సోమాజిగూడలో మీట్ ది ప్రెస్‌లో మాట్లాడిన కేటీఆర్…మత ప్రాతిపదికన హైదరాబాద్‌ను విభజించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని వాటిని ప్రజలు తిప్పికొట్టాలన్నారు.
ప్రజలంతా ఐక్యమత్యంతో ఉండాలని టీఆర్ఎస్ కొరుకుంటోందని కానీ అలాంటి పరిస్ధితి కొన్నిపార్టీలకు ఇష్టం లేదని తెలిపారు. గత ఆరేళ్లలో హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధికి ఓటేయాలని కోరారు. ప్రజల మధ్య మత విద్వేశాలు రెచ్చగొట్టాలని చూస్తే ఎట్టి పరిస్ధితుల్లో సహించమని స్పష్టం చేశారు కేటీఆర్.
గ్రేటర్ పరిధితో పాటు శివారు ప్రాంతాల్లో కేసీఆర్ సీఎం అయ్యాక వాయువేగంతో తాగునీటి సమస్యను పరిష్కరించామని కేటీఆర్ తెలిపారు. ఒకప్పుడు ఫిబ్రవరి, మార్చి వచ్చిందంటే వందలాది మంది మహిళలు ఖాళీ బిందెలతో నిరసనలు చేపట్టేవారు. 14 రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చే దుస్థితి. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత మంచినీటికి ఇబ్బందులు లేకుండా చేశామన్నారు.
మహానగరం కోసం గత పాలకులు ఏం చేయలేదు. 75 సంవత్సరాల్లో ఏ రోజు ఏ ఒక్క మహానుభావుడు, ఏ ఒక్క సీఎం కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు గురించి ఆలోచించలేదు. 1916లో ఉస్మాన్ సాగర్, హిమాయాత్ సాగర్ కట్టారు. 1920లో గండీపేట, మళ్లీ వందేళ్ల తర్వాత 2020లో కేశావపురం రిజర్వాయర్ కడుతున్నాం అన్నారు.