యస్సీ,యస్టీలకు ప్రభుత్వ సహకారం-కేటీఆర్‌

228
Telangana Minister KTR,Telangana Mining Department,KTR Review Meeting,Telangana News,Telangana Berking News,Latest Telangana News,
- Advertisement -

త్వరలోనే వడ్డెర సోసైటీలకు, యస్సీ యస్టీ యువకులతో ఏర్పడే సోసైటీలకు మాన్యూఫాక్చర్ సాండ్ ప్లాంట్ల ఏర్పాట్లుకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని మైనింగ్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. ప్రస్తుతం ఇసుక రీచుల నుంచి వస్తున్న సహాజ ఇసుక బదులు మాన్యూఫాక్ఛరింగ్ సాండ్ వినియోగం పెంచాల్సిన అవసరం ఉన్నదని, అయితే ఈ మాన్యూఫాక్చరింగ్ సాండ్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. వివిధ వర్గాల సంక్షేమానికి ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న ప్రభుత్వం ఈ సాండ్ ప్లాంట ఏర్పాటులో సాంప్రదాయికంగా ఇదే పనిలో ఉన్న వడ్డెరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. గత కొన్నేళ్లలో వచ్చిన స్టోన్ క్రషర్ల వంటి వాటి ద్వారా వడ్డెరాల ఉపాది పోయిందని, వారికి ఈ విధంగా అయిన ఉపాది దొరుకే అవకాశం ఉందన్నారు.

Minister KTR reviews Mining Department

వీరితోపాటు యస్సీ, యస్టీ యువకులు సైతం మ్యాన్యూఫాక్చరింగ్ సాండ్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు సోసైటీలుగా ఏర్పడి ముందుకు వస్తే వారికి ప్రభుత్వ సహకారం అందిస్తుందని మంత్రి తెలిపారు. ఇలా స్వయం ఉపాది కల్పించేందుకు యస్సీ,యస్టీ సంక్షేమ శాఖ, ఉప ప్రణాళికల ద్వారా అర్ధిక సహాయం, ప్రభుత్వం తరపున శిక్షణ, రుణాలు ఇవ్వడం ద్వారా వారి ప్రభుత్వం పూర్తి సహాకారం అందిస్తుందన్నారు. త్వరలోనే రంగా రెడ్డి జిల్లాలో ప్రయోగాత్మకంగా మాన్యూఫాక్చరింగ్ సాండ్ తయారీ ప్లాంటను వడ్డెరాలు, యస్సీ, యస్టీల అద్వర్వంలో ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

మైనింగ్ శాఖ పైన మంత్రి సమీక్ష నిర్వహించారు. రానున్న సంవత్సర కాలంలో జిల్లాల వారీగా అవసరం అయ్యే ఇసుక అవసరాలు, డిమాండ్ ఏమేరకు ఉంటుందో అంచనాలు సిద్దం చేయాలని మంత్రి అధికారులను అదేశించారు. ముఖ్యంగా ప్రభుత్వ ప్రాజెక్టులు, ప్రయివేటు హౌసింగ్ వంటి వివరాలతో కూడిన అంచనాలు తయారు చేసుకుని, ఈ మేరకు డిమాండ్ ఇసుక సరఫరాను నిర్ధేశించుకునేందుకు ప్రయత్నించాలన్నారు. స్థానికంగా, రాష్ర్ర్ట వ్యాప్తంగా ఉన్న ఇసుక రీచులు( వనరులు)జిల్లాలా వారీగా మ్యాపింగ్ చేయాలన్నారు. మైనింగ్ శాఖ వద్ద సరైన, ఉన్నప్పుడు ఇసుక సరఫరా వ్యూహాన్ని తయారు చేసుకోవచ్చన్నారు.

Minister KTR reviews Mining Department

పోలీలు, రెవెన్యూ మరియు మైనింగ్ శాఖాధికారులు సంయుక్తంగా ఇసుక తవ్వకాలపైన పర్యవేక్షణ చేయాని, ఏక్కడైన నిబంధనలకు విరుద్దంగా మైనింగ్ లేదా ఇసుక తరలింపు జరిగితే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు అదేశాలు జారీ చేశారు. ఈ మేరకు త్వరలోనే జిల్లా కలెక్టర్లు, యస్పీలతో విడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో నిర్ణయం తీసుకున్న మేరకు విధుల్లో ఉత్తమ పనితీరు ప్రదర్శిస్తున్న ఉద్యోగులకు ప్రొత్సహాకాలు అందించే మార్గదర్శకాలను మంత్రి ఈ సమావేశంలో అమోదించారు. ఇప్పటిదాకా 517 నాన్ వర్కింగ్ మైనింగ్ లీజులను రద్దు చేసినట్లు మంత్రికి అధికారులు తెలిపారు.

బయ్యారం స్టీలు ప్లాంటు అంశంపైన చర్చించేందుకు సింగరేణి, యన్ యండిసి, మైనింగ్ శాఖాధికారులతో త్వరలో సమావేశం కానున్నట్లు తెలిపారు. మైనింగ్ జరుతున్న ప్రాంతాల్లో పర్యవేక్షణ కోరకు డ్రోన్ కెమెరాలతో ప్రయోగాత్మంగా చేపట్టిన కార్యక్రమాన్ని మంత్రికి అధికారులు వివరించారు. టెక్నాలజీ వినియోగం వలన మైనింగ్లో మరింత పారదర్శకత వస్తుందన్నారు. టియస్ యండిసి ఇతర రాష్ర్టాల్లోను మైనింగ్ కార్యాకలాపాలు చేపట్టేందుకు జాతీయ స్దాయి బిడ్డింగ్గుల్లో పాల్గోంటున్నట్లు మైనింగ్ శాఖాధికారులు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ మైన్స్ సుశీల్ కూమార్, టియస్ యండిసి యండి మల్సూర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గోన్నారు.

- Advertisement -