ఈరోజు మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రోడ్డు మార్గం గుండా ఆయన సిరిసిల్ల జిల్లాకు చేరుకున్నారు. అనంతరం గంభీరావుపేట మండలం నర్మాల ప్రాజెక్టు గెస్ట్‌హౌజ్‌లో కలెక్టర్‌తో పాటు ఆయా అధికారులతో నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిరిసిల్ల కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఇతర జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాను మరింత అబివృద్ది చేయాలని అధికారులకు ఆయన తెలిపారు. ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలిని తెలిపారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు ఆదుకోవాలన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాకు రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయ ఉత్పత్తులను దేశంలో ఎక్కడికైనా తరలించవచ్చు. మానేరు వాగుపై ఉన్న ఎగువ మానేరు జలాశయం పర్యాటక అభివృద్ధికి అన్ని విధాలా అనుకూలంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇక సమావేశం అనంతరం అక్కడి నుంచి తంగళ్లపల్లి మండల కేంద్రానికి వెళ్లారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రూరల్ పోలీస్ స్టేషన్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించి అనంతరం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారు.