- Advertisement -
నిరాడంబర నాయకుడు,గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి సోలిపేట రామలింగారెడ్డి అన్నారు మంత్రి కేటీఆర్. అసెంబ్లీ సమావేశల సందర్భంగా రామలింగారెడ్డి సంతాప తీర్మానంపై మాట్లాడిన కేటీఆర్….ప్రస్తుత రాజకీయాల్లో రామలింగారెడ్డి లాంటి నాయకులు అరుదని అన్నారు. కలం వీరుడిగా ఉద్యమానికి మద్దతునిచ్చిన వ్యక్తి రామలింగారెడ్డి అని పేర్కొన్నారు.
2004లో జరిగిన ఎన్నికల సందర్భంగా దొమ్మాట నియోజకవర్గానికి రామలింగారెడ్డి అయితేనే న్యాయం చేస్తారని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భావించారని, ఆ టికెట్ కోసం ఎంతోమంది ప్రయత్నించినప్పటికీ కేసీఆర్ పట్టుబట్టి రామలింగారెడ్డికే టికెట్ ఇచ్చారని వెల్లడించారు.
- Advertisement -