మిస్ యూ నర్సన్న : కేటీఆర్

181
ktr minister
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర తొలి హోంమంత్రి,కార్మికోద్యమ నేత నాయిని నరసింహరెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. నాయిని మృతితో టీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర దిగ్బ్రాంతిలో మునిగిపోగా నేతలు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

నాయిని మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు కేటీఆర్. ఉద్యమనేతగా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యమంత్రి కేసిఆర్ వెంట నిలిచిన జన నాయకులు, కార్మిక పక్షపాతిగా, తెలంగాణ మొదటి హోం మంత్రిగా మనందరి మనస్సులో నాయిని చిరస్థాయిగా నిలిచిపోతారని తెలిపారు కేటీఆర్. ఆయన మృతి అందరిని కలచివేసిందని మిస్ యూ నర్సన్న అంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు కేటీఆర్.

- Advertisement -