రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఆపారా?

27
- Advertisement -

ప్రధాని మోడీపై మరోసారి సెటైర్ వేశారు మంత్రి కేటీఆర్. గొప్పల కోసం బీజేపీ నేతల చెప్పుకుంటున్న బడాయి మాటలను ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు కేటీఆర్. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు కేటీఆర్.

బీజేపీ పాలిత రాష్ట్రాలైన కర్ణాటక, మహరాష్ట్ర మధ్య నెలకొన్న బెలగావి సరిహద్దు సమస్యను ఇంతవరకు ప్రధాని నరేంద్ర మోదీ పరిష్కరించలేకపోయాడు..కానీ రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధాన్ని మాత్రం ఆపారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపారనేది అవాస్తవమని వాళ్ల నేతృత్వంలోని విదేశాంగ మంత్రిత్వ శాఖనే వెల్లడించిందని గుర్తు చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -