ఎంపీ నామాపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు..

22
ktr

ఎంపీ నామా నాగేశ్వరరావుపై ప్రశంసలు గుప్పించారు మంత్రి కేటీఆర్. గిప్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆరు అంబులెన్స్‌ల‌ను అందించి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. ఈ అంబులెన్స్‌ల‌ను మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…దేశంలోనే ఏ ఎంపీ కూడా చేయని విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల సంక్షేమం కోసం ఆరు అంబులెన్స్ లు అందించడం గొప్ప విషయమన్నారు. ఈ అంబులెన్స్‌ల‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్స్ కు కేటాయిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్‌, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సైదిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యదర్శి బండి రమేష్, చిత్తారు సింహాద్రి, నామ పృథ్వి, నామ భవ్య, ఫోర్స్ మోటార్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.