సిడ్నీ టెస్టు డ్రా…

43
sydney test

భారత్ – ఆసీస్ మధ్య జరగుతున్న సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది. భారత బ్యాట్స్‌మెన్ అసాధారణ పోరాట పటిమ కనబర్చడంతో టెస్టు డ్రాగా ముగిసింది. రిషబ్ పంత్ (97) వేగంగా ఆడి ఆసీస్ బౌలర్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడు. పంత్‌కు తోడు పుజారా(77), విహారి(23 నాటౌట్‌), అశ్విన్(39 నాటౌట్‌) రాణించడంతో చివరికి టెస్టు డ్రాగా ముగిసింది.

నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు 98 పరుగులతో బ్యాటింగ్ ఆరంభించిన భారత్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రహానే కేవలం (4) పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. తర్వాత పంత్‌తో కలిసి పుజారా నాలుగో వికెట్‌కు 148 ప‌రుగులు జోడించి టీమిండియాకు మ్యాచ్ డ్రాపై ఆశ‌లు రేకెత్తించాడు. పంత్ 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో పంత్ 97 ప‌రుగులు చేసి సెంచరీ చేజార్చుకోగా పుజారా (77) కూడా హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔట్ కావ‌డంతో టీమిండియా గ‌ట్టెక్కుతుందా అన్న అనుమానాలు క‌లిగాయి.

ఈ దశలో ఆసీస్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నారు విహారి, అశ్విన్. చివ‌రి సెష‌న్‌లో 36 ఓవ‌ర్ల పాటు ఆసీస్ బౌల‌ర్ల‌ సహనానికి పరీక్ష పెట్టారు. దీంతో సిడ్నీ టెస్టు డ్రాగా ముగిసింది.