మంత్రి కేటీఆర్ ను కదిలించిన దివ్యాంగ వృద్దురాలు అయ్యా నాకేం చేయ్యకున్న సరే కానీ బాంచెన్..మాలిపురం శాలోల్లను ఆదుకొండి సిరిసిల్ల శాలోల్లకు మంచిగా చేస్తున్నవని మా అల్లుడు ఊకే యాదిజేస్తడు వృద్దురాలి ముచ్చటకు ముగ్ధుడైన మంత్రి కేటీఆర్. నల్గొండ జిల్లా చేనేత కార్మికుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ కు ఆదేశాలు నల్లొండ జిల్లా అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు మాలిపురం చేనేత కార్మికులలే కాదు..చేనేత కార్మికులందరిని ఆదుకుంటామని కేటీఆర్ హమీ ఇచ్చారు.
మంత్రి కేటీఆర్ పర్యటన ఉందంటే చాలు..చాలా మంది తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. ఎందుకంటే కేటీఆర్ దృష్టికి సమస్య వెళితే.. సాధ్యమైనంత వరకు సమస్య పరిష్కారం అవుతుందనే దీమానే ఎక్కువగా ఉంటుంది. శనివారం రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హజరైన కేటీఆర్ తిరుగుయనంలో ఓ దివ్యాంగ వృద్దురాలు.. మంత్రి కేటీఆర్ ను ఆకట్టుకుంది. కేటీఆర్ జెండాపండగా అనంతరం తిరిగి వెళ్తున్న క్రమంలో ఓ కేటీఆర్ సారూ..ఓ కేటీఆర్ సారూ అంటూ గట్టిగా పిలిచింది. పసిగట్టిన కేటీఆర్ వృద్దురాలి వద్దకే వెళ్లాడు. ఏమామ్మ ఏమైన పెన్షన్ అవసరం ఉందా..ఏ సమస్య ఉంది అని అడిగాడు. సారూ నేను వచ్చి రెండు గంటలవుతుంది..ఎవరు లోపలకు రానిస్తలేరు..మీ పుణ్యాన నెలకు మూడు వేల పెన్షన్ వస్తుంది కానీ సారూ.. మా అల్లుడు నల్గొండ జిల్లా..తిరుమలగిరి పక్కన.. మాలిపురంలో ఉంటడు బాంచెన్. అక్కడ 30 కుటుంబాలు శాలోల్లయి ఉన్నయి.
రెండు నెల్లుగా.. వారికి పని నడుత్తలేదు.. బట్ట ఎవలు కొంటలేరు..వాళ్లను ఆదుకొండి సారూ..ఊకే మా అల్లుడు నిన్ను యాది జేస్తడు..సిరిసిల్ల శాలోల్లకు కేటీఆర్ మంచిగా చేస్తుండే అని..నాకు బాగా సార్లు చెప్పిండు సారూ. మా అల్లుని ఊరోళ్లకు ఏమైన సాయం చేయండి అంటూ సిరిసిల్ల పట్టణానాకి చెందిన పులి విజయమ్మ(60) అనే వృద్దురాలు మంత్రి కేటీఆర్ ను ఆర్థించింది.దీంతో కేటీఆర్ ఫీదా అయ్యాడు. ఇంతసేపు వెయిట్ చేసి నిల్చోని చెప్పుకున్నది నీ సమస్య కాదా..పక్కా జిల్లాలో చేనేత కార్మికుల సమస్య గురించా అని కేటీఆర్ చలించిపోయాడు. వెంటనే నల్లొండ జిల్లా కలెక్టర్ ను లైన్లోకి తీసుకోవాలని పక్కనే ఉన్న పీఎస్ శ్రీనివాస్ ను ఆదేశించారు. మాలిపురమే కాదు నల్లొండ జిల్లాలో చేనేత కార్మికుల స్థితిగతులు.. ప్రభుత్వ పథకాలు అందరికి వర్తిస్తున్నాయా లేదా..ఎందుకు అక్కడ సమస్య తలెత్తింది..అన్ని విషయాలు సాయంత్రం లోపే నాకు తెలియాలని కేటీఆర్ ఆదేశించడంతో నల్లొండ జిల్లా యంత్రాంగం ఉరుకులు పరుగులు మీద మాలిపురంకు క్యూ కట్టారు.
చేనేత కార్మికుల సమస్యలపై నివేదికను తయారు చేస్తున్నారు. దివ్యాంగ వృద్దురాలు.. వృద్దురాలి అభ్యర్థనతో మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు నల్లొండ జిల్లా చేనేత కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలని కోరుకుందాం. దీంతో పాటు దివ్యాంగ వృద్దురాలు అద్దెకు ఉంటున్నాని చెప్పడంతో విజయమ్మ స్థితి గతిని చూసి ..తగిన సాయం చేయాలని ఆదేశించడంతో సిరిసిల్ల తహశీల్ధార్ అంజన్న ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది విజయమ్మను తీసుకొని ఆవిడ నివాసం ఉంటున్న ఇంటికి వెళ్లారు. ఏది ఏమైన ఈ దివ్యాంగ వృద్దురాలి విజయమ్మ మంత్రి కేటీఆర్ మనసే కాదు..అక్కుడున్న అధికారులు, నాయకులను ఆలోచింపజేసింది. సమస్య ఎక్కడిదని కాదు.. మనసుంటే మార్గముంటుందని ..ఈ సంఘటన రుజువు చేసింది. హట్సాప్ విజయమ్మ..నీ లాగా.. స్పందించే గుణం.. నాయకులందరికి ఉంటే బాగుండు. ఇక్కడ మంత్రి కేటీఆర్ స్పందించడం గొప్ప కాదు కానీ.. రెండు గంటలు వేచిచూసి..సెక్యూరీటి దాటుకొని..మంత్రి కేటీఆర్ దృష్టికి సమస్య తీసుకెళ్లిన విజయమ్మది నిజమైన పోరాట పటిమ. ఇతరుల మేలు కోరే తత్వం. మా అల్లుడికే సాయం చేయుమనోచ్చు కానీ..ఇక్కడ విజయమ్మ మా అల్లుని ఊరోళ్లందరికి ఏమైన చేయ్ సారూ అని అడిగి అందరి మనసులు కొల్లగోట్టావ్. నల్లొండ జిల్లాలోనే కాదు..తెలంగాణా రాష్ట్రంలోని చేనేత కార్మికుల సమస్యలపై ప్రభుత్వ స్పందించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్బాల్లో మంత్రి కేటీఆర్ స్పందించే తీరు అభినందనీయం.తనకోసం కాకుండా నలుగురికోసం…మంచి కోసం ఆలోచించిన విజయమ్మకు…..అరవయ్యేళ్ళ అవ్వ విజయమ్మని చూసి , సమస్యలు చూసి కూడా స్పందించని వారంతా ఆలోచించాలి. హాట్సాఫ్ విజయమ్మ.