మేకపాటి ఆత్మకు శాంతిచేకూరాలి: కేటీఆర్

47
ktr minister
- Advertisement -

ఏపీ ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి మృతిప‌ట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్విట్టర్ వేదికగా ప్రార్ధించారు. గౌత‌మ్ రెడ్డి మ‌ర‌ణ‌వార్త త‌న‌ను షాక్‌కు గురి చేసింద‌ని…ఆయన కుటుంబ స‌భ్యుల‌కు, స‌న్నిహితుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు.

అలాగే స్పీకర్ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మారావు గౌడ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తూ వారి కుటుంబ సభ్యులకు స్పీకర్ పోచారం ప్రగాఢ సానుభూతి తెలిపారు. పిన్న వయసులోనే మేకపాటి మృతిచెందడం బాధాకరమన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. మేకపాటి ఆత్మకు శాంతి చేకూరాల‌ని, ఆ భ‌గ‌వంతుడు వారి కుటుంబ స‌భ్యుల‌కు మ‌నోధైర్యాన్ని ప్రసాదించాల‌ని ప్రార్థించారు.

- Advertisement -