కేంద్ర ఐటీశాఖ మంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి..

112
ktr
- Advertisement -

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (ఐటీఐఆర్‌) ప్రాజెక్టును పునరుద్ధరించాలని కేంద్ర మంత్రిని తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ గురువారం కేంద్ర ఐటీశాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.హైదరాబాద్​లో ఐటీఐఆర్​ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించిన విషయాన్ని కేటీఆర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై ఆరేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్​ పలుమార్లు కేంద్రానికి లేఖలు రాశారని చెప్పారు. ఐటీఐఆర్​ పథకాన్ని పునరుద్ధరిస్తే ఈ రంగంలో తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తుతాయన్నారు.

విద్యుత్తు నిల్వకు సంబంధించి ఎలక్ట్రానిక్స్​ ఉత్పాదక సముదాయాలు- దివిటిపల్లిని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం దుండిగల్​లో 450 ఎకరాలు గుర్తించామని, ఈ అంశంపై దృష్టి సారించాలని కోరారు. గ్రామపంచాయతీలకు టి-ఫైబర్​లో ఇచ్చిన కనెక్షన్లకు గాను ముందుగా చేసుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం భారత్​ నెట్​ ప్రాజెక్టు-రెండో దశ కింద నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. టి-ఫైబర్​ నెట్​వర్క్​కు నేషనల్​ ఆప్టికల్​ ఫైబర్​ నెట్​వర్క్​ మొదటి దశ నెట్​వర్క్​ను బదిలీ చేయాలని కోరారు. పంచాయతీల పరిధిలోని ప్రతి ఆవాసం, వాటిలోని ప్రతి ఇంటికి ఫైబర్​ నెట్​ను అనుసంధానించేందుకు అదనంగా రూ.1200 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -