- Advertisement -
రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి భూమి పూజ చేశారు మంత్రి కేటీఆర్. దాదాపు 100 ఎకరాల్లో 800 కోట్ల వ్యయంతో ఈ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం జరగనుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…ఈ కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ అనితా రెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- Advertisement -